ఈనెల 26 నుంచి ‘విశ్వంభర’ కొత్త షెడ్యూల్

‘బింబిసార’ ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ జోనర్‌లో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ఈనెల 26న హైదరాబాద్లో ప్రారంభం కానుంది. ఈ మూవీ లో చిరంజీవికి జోడిగా త్రిష నటిస్తుండగా.. ఈ సినిమాలో చిరంజీవికి మొత్తం ఐదుగురు చెల్లెల్లు ఉంటారని సమాచారం.

అయితే ఇప్పటికే చాలా మంది హీరోయిన్లను ఈ సినిమా కోసం సెలెక్ట్ చేయగా.. ఎవరెవరు చిరంజీవికి చెల్లెల్లుగా కనిపించబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన మృణాల్ ఠాకూర్, సురభి, ఆషికా రంగనాథ్ లు చిరుకు చెల్లెల్లుగా ఈ సినిమాలో దర్శనం ఇవ్వబోతున్నారు. మరి ఇంకో రెండు పాత్రల్లో అంటే మరో ఇద్దరు చెల్లెల్లుగా ఎవరిని సెలెక్ట్ చేశారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.