చింతకాయల విజయ్ సీఐడీ విచారణ పూర్తి

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సీఐడీ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు విజయ్‌ను సీఐడీ అధికారులు విచారించడం జరిగింది. విచారణ అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడుతూ రెండోసారి సీఐడీ విచారణకు వెళ్లానని … మొన్న 68 ప్రశ్నలు ఈరోజు 42 ప్రశ్నలు వేశారని, అన్ని ప్రశ్నలకు సమధానాలు చెప్పానని తెలిపారు.

హైకోర్టులో కూడా దీనిపై విచారణ జరగనుందని తెలిపారు. గతంలో టీడీపీ గ్రామస్థాయి నిర్మాణం వరకు వివరాలు అడిగారని, చంద్రబాబు, లోకేశ్‌కు సంబంధించిన అంశాలు కాకుండా ఫిర్యాదు ఆధారంగా ప్రశ్నలు అడగాలని సీఐడీకి చెప్పానని తెలిపారు. గతేడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య భారతిని లక్ష్యంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చక్కర్లు కొట్టింది. అయితే దీన్ని ఐటిడిపి బాగా సర్క్యులేట్ చేసిందంటూ పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ కేసు విచారణలో భాగంగానే చింతకాయల విజయ్ ను గతనెల జనవని 30న సిఐడి విచారణకు హాజరయ్యారు. విచారణ పూర్తికాకపోవడంతో ఇవాళ మరోసారి హాజరుకావాల్సిందిగా సిఐడి అధికారులు కోరారు. దీంతో విజయ్ లాయర్ ను వెంటబెట్టుకుని సీఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.