కొండ పొలం మూవీ చూసి చిరంజీవి ఏమన్నారో తెలుసా..?

ఉప్పెన సినిమాతో మెగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండపొలం ఉప్పెన విడుదల కంటే ముందే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. అయితే కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. కొండ పొలం నవల ఆధారంగా క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. కేవలం 45 రోజుల్లోనే మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలో షూటింగ్ పూర్తి చేయడం విశేషం. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో డీ గ్లామర్ పాత్రలో నటించింది. దసరా కానుకగా ఈరోజు (అక్టోబర్ 8న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. అయితే ఓ రోజు ముందే ఈ చిత్రాన్ని చిరంజీవి ఫ్యామిలీ చూసారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన చిరంజీవి.. క్రిష్ సినిమాలంటే డిఫరెంట్ జోనర్ మూవీస్ అని అనుకుంటాం. ఈ సినిమాకు చూసిన వారు థ్రిల్‌కు లోన‌వుతార‌నే మాట వాస్తవం. క్రిష్ డైరెక్ష‌న్‌లో సినిమా అంటే కాస్త వెరైటీ ఉంటుంది. మంచి పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంటుంది. వైష్ణ‌వ్ తేజ్ పెర్ఫామెన్స్ కానీ, క్యారెక్ట‌రైజేష‌న్ కానీ అన్నీ డిఫ‌రెంట్‌గా ఉన్నాయి. క్రిష్‌ సినిమాల‌ను నేను ముందు నుంచి చూస్తూ వ‌స్తున్నాను. ఒక సినిమాకు మ‌రో సినిమాకు సంబంధం ఉండ‌దు. ‘కొండ‌పొలం’ చిత్రం చ‌క్క‌టి ర‌స్టిక్ ల‌వ్‌స్టోరి. ఈ ప్ర‌కృతిని ఎలా కాపాడుకోవాలో చెప్పిన క‌థాంశం. మంచి మెసేజ్‌తో కూడిన ల‌వ్‌స్టోరి అని చిరంజీవి తెలిపారు.

ఇలాంటి సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆహ్వానించాలి, ఆద‌రించాలి. ‘కొండ‌పొలం’ మూవీ త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని నేను ప్ర‌గాఢంగా న‌మ్ముతున్నాను తెలియ‌జేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించారు.

The first review is the Mega review ! 💥
Megastar @KChiruTweets garu’s heartfelt wishes and his review of the epic #KondaPolam !#PanjaVaisshnavTej @RakulPreet @DirKrish @mmkeeravaani @Gnanashekarvs @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel pic.twitter.com/IwWt06akXQ— Mohan Superhit (@mohankumaar82) October 8, 2021