యూఎస్ లో ‘కార్తికేయ 2 ‘ 50 రోజుల వేడుక

మిస్టరీ థ్రిల్లర్ గా థియేటర్స్ లోకి వచ్చిన చిత్రం కార్తికేయ 2 . కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ద్వారక బ్యాక్ డ్రాప్ లో ఒక సరికొత్త మిస్టరీని చాలా ఇంట్రెస్టింగ్ గా దర్శకుడు తెరపైకి పైకి తీసుకువచ్చాడు. మొదటి రోజు మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడం , సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా లో సినిమా ఫై పాజిటివ్ గా స్పందించడంతో రోజు రోజుకు కలెక్షన్లు విపరీతంగా పెరిగాయి. అసలు థియేటర్స్ వైపు చూడని ప్రేక్షకులను మళ్లీ థియేటర్స్ కు అలవాటయ్యేలా కార్తికేయ 2 చేసింది.

తాజాగా ఓవర్సీస్ లో ఈ చిత్ర 50 రోజుల వేడుక జరగడం విశేషం. ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. ఇటీవలే ఈ చిత్రం విజయవంతంగా 50 రోజుల రన్ను పూర్తి చేసుకుంది. ఓవర్సీస్ లో రెడ్ హార్ట్ మూవీస్ చిత్రాన్ని రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో సదరు సంస్థ భారీ ఎత్తున అర్ధశత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ హాజరై సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా అమెరికాలో ఇంత గొప్ప విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఓవర్సీస్ లో ఇలాంటి వేడుకలు చాలా రేర్. సినిమా పెద్ద హిట్ అయి..పంపిణీదారులకు భారీ లాభాలు వస్తే తప్ప ఇలాంటి వేడుకలు నిర్వహించరు. అలా నిర్వహించారంటే పంపిణీదారులు ఊహించిన దానికంటే అధిక లాభాలు తెస్తేనే ఇలాంటి వేడుకలకి ఆస్కారం ఉంటుంది. ఆ కోవలో కార్తికేయ-2 నిలవడం విశేషం.