బిల్ గేట్స్ కు కరోనా..స్వల్ప లక్షణాలున్నాయని ట్వీట్‌

పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని ఆశాభావం

న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా సంక్రమించిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. వైద్య నిపుణుల సూచన మేరకు ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో ఉన్నానని, త్వరలోనే పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకుంటానని పేర్కొన్నారు. అదృష్టవశాత్తు తాను కరోనా టీకాలు తీసుకున్నానని, బూస్టర్ డోసు కూడా వేసుకున్నానని తెలిపారు.

కాగా, కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని వణికించిన సమయంలో గేట్స్ ఫౌండేషన్ పేద దేశాలకు అండగా నిలబడింది. వ్యాక్సిన్లు, ఔషధాలను సరఫరా చేసింది. యాంటీ వైరల్ జనరిక్ కొవిడ్ పిల్స్ యాక్సెస్‌ను పెంచేందుకు 120 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు బిల్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ పలు పేద దేశాలకు వ్యాక్సిన్లు, ఔషధాలను అందజేసింది. అదేవిధంగా యాంటీవైరల్ జనరిక్‌ కరోనా పిల్స్‌ను సరఫరా చేసేందుకు తన ఫౌండేషన్ తరపున 120 మిలియన్ల డాలర్లను బిల్‌గేట్స్‌ వెచ్చించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/