ఓటు హక్కుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఒకరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు మెగాస్టార్ చిరంజీవి. ‘మన దేశ 18వ లోక్ సభ ఎలక్షన్లు త్వరలో జరగబోతున్నాయి.

మీకు 18 సంవత్సరాల వయస్సు వస్తే మీరు మొట్టమొదటిసారి ఓటు వేసే హక్కు పొందుతారు. మీ మొదటి ఓటు – మనరాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం వినియోగించండి.. తప్పనిసరిగా ఓటు వేయండి !!’ అని చిరంజీవి పేర్కొన్నారు. ఇందుకు యువతకు స్ఫూర్తినిచ్చేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన గీతాన్ని పోస్ట్ చేశారు.