‘వారం రోజుల్లో ప్రతిజిల్లాలో ఆక్సిజన్ బ్యాంకు’

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

Chiranjeevi
Chiranjeevi

ప్రస్తుతం కరోనా పేషెంట్స్ కు అవసరమైన ఆక్సిజన్ అందక పలుచోట్ల మరణాలు సంభవించిన సంఘటనలు విదితమే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇదే విషయంపై స్పందించారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోవడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. రక్తం దొరక్క ఏ ఒక్కరూ ప్రాణాలు పోకూడదని 1998 లో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేశానని గుర్తుచేశారు. తనవంతు సాయంగా ఇప్పుడు ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లోనే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శరవేగంగా పనులు సాగుతున్నట్లు చిరంజీవి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం :https://www.vaartha.com/specials/kids/