మెగాస్టార్ చిరంజీవికి కరోనా

నన్ను కలిసినవారందరు టెస్ట్ చేయించుకోవాలి..చిరంజీవి

Chiranjeevi
Chiranjeevi

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమాలో నటించాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షూటింగ్ లో పాల్గొనడం కోసం పరీక్ష చేయించుకోగా తనకు కరోనా సోకినట్లు తెలిసిందని ఆయన ట్వీట్ చేశారు. ‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 45 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/