తమిళనాడు సీఎం ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

తమిళనాడు సీఎం ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి..బుధువారం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ను కలిశారు. ముఖ్యమంత్రి గా పదవి చేపట్టిన దగ్గరి నుండి స్టాలిన్ తనదైన మార్క్ నిర్ణయాలు తీసుకుంటూ అందరికి ఆదర్శం అవుతున్నారు. ఎన్నికల్లో గెలిచి అతి తక్కువ సమయంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి గా అందరు మాట్లాడుకునేలా అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం స్టాలిన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తమిళనాడు సీఎం ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

మంగళవారం జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన అధికారిక ట్విట్టర్ లో స్టాలిన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ నోట్ విడుదల చేయగా…ఈరోజు మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ ను కలిశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి ఆయనను అభినందించారు. స్టాలిన్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పారు. ఈ సందర్భంగా అక్కడ స్టాలిన్ తనయుడు ఉదయనిధి కూడా ఉన్నారు. చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ చేస్తున్నాడు. సంక్రాంతి బరిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే లూసిఫర్ , వేదాళం రీమేక్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.