చెప్పుతో కొడతానంటూ.. తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ వివాదస్పద వ్యాఖ్యలు

గతంలో ఎన్నికల సమయంలో దొంగ ఓటు వ్యవహారం తో వార్తల్లో నిలిచిన తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్న మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆమె భర్త భూకబ్జాలపై నిలదీసిన ప్రజలను చెప్పుతో కొడతానంటూ పబ్లిక్ గా హెచ్చరించడం ఫై అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్వప్న భర్త తాటికొండ పరిమల్ గుప్తా భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని ..కష్టపడి దాచుకున్న సొమ్ముతో కొనుక్కున్న స్థలాలను చైర్ పర్సన్ భర్త పరిమల్ కొందరు వ్యక్తులతో కలసి కబ్జా చేస్తున్నారని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పట్టణంలోని 13వ వార్డుకు వెళ్లిన ఛైర్ పర్సన్ స్వప్న.. తమపై ఫిర్యాదు చేసిన పేదలు, బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనం కోల్పోయిన ఆమె.. మాపైనే ఫిర్యాదు చేస్తారా.. మిమ్మల్ని చెప్పుతో కొడతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేదలను చెప్పుతో కొడతానని ఆమె చేసిన వ్యాఖ్యలను స్థానిక కౌన్సిలర్, కాంగ్రెస్ నేత వరాల శ్రీనివాస్ రెడ్డి తో పాటు స్థానికులు తీవ్రంగా ఆగ్రహిస్తూ చైర్‌పర్సన్ క్షేమపణలు చెప్పాలని నిరసన కు దిగారు.