నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు సిద్దమైన శ్యామ్ సింగ రాయ్..

నాని , సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ జంటగా రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం శ్యామ్ ​సింగ రాయ్. భారీ అంచనాల మధ్య గత వారం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై చక్కటి విజయం సాధించింది. టాక్ పరంగానే కాక కలెక్షన్ల పరంగా కూడా శ్యామ్ సింగ రాయ్ కుమ్మేస్తుంది. ఈ తరుణంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఓ పాపులర్ ఓటిటి సంస్థ దక్కించుకుంది.

ప్రముఖ నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ శ్యామ్ సింగ రాయ్ డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. జనవరి 4వ వారం నుండి దీనిని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. కరోనా లాక్ డౌన్ కారణంగా సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటిటి లకు అలవాటు పడిన సంగతి తెలిసిందే. తక్కువ ధరల లో స్ట్రీమింగ్ ప్యాకేజ్ లు ఇస్తుండడం తో ఇంటిల్లిపాది తమ ఇంట్లోనే కొత్త సినిమాలను చూడడం అలవాటు చేసుకున్నారు. అందుకే ఓటిటి సంస్థలు పోటీపడి పెద్ద సినిమాలను భారీ ధరలకు డిజిటల్ రైట్స్ దక్కించుకుంటున్నాయి.