బండి సంజయ్ తో గద్దర్ భేటీ..

gaddar meets bandi sanjay

ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తో భేటీ అయ్యారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు పెట్టాలని బండి సంజయ్ కి వినతిపత్రం అందజేశారు. బండి సంజయ్ ను కలిసి గద్దర్ ఆలింగనం చేసుకున్నారు. కొత్త లుక్ లో కనిపిస్తున్నావంటూ గద్దర్ తో బండి సంజయ్ సంభాషించారు.

గద్దర్ తో పాటు ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ నాయకులు వచ్చారు. ఇటీవల కాలంలో గద్దర్ బీజేపీ సభలు, సమావేశాలకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టే విషయమై ఇటీవల రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చకు తీసుకువచ్చేలా తీర్మానం చేశాయి. ఈ క్రమంలోనే గద్దర్ నేడు బీజేపీ ఆఫీసుకు వచ్చి బండి సంజయ్ ని కలిశారు.