నెట్ ఫ్లిక్స్ కు గాడ్ ఫాదర్ ఓటిటి రైట్స్..

మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్ర ఓటిటి డీల్ కుదిరినట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్ ను స్పీడ్ చేసారు. ఇప్పటికే చిరంజీవి , నయనతార , సత్యదేవ్ తాలూకా ఫస్ట్ లుక్ , ‘థార్ మార్ థ‌క్క‌ర్ మార్’ సాంగ్ లు సినిమా ఫై క్రేజ్ తెచ్చాయి.

దీంతో ఓటిటి రైట్స్ దక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీ పడగ చివరగా నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి సొంతం చేసుకున్నట్లుగా వినికిడి. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమలో హీరో సత్యదేవ్ రాజకీయ నాయకుడి పాత్రలో నటించాడు. ఇందులో చిరుకి చెల్లెలు పాత్రలో నయనతార నటించింది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో రిలీజ్ చేయనున్నారు.