చిరంజీవి వర్సెస్‌ రాజశేఖర్‌

మా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ డైరీ ఆవిష్కరణలో వివాదం

chiranjeevi & rajasekhar
chiranjeevi & rajasekhar

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి మరియు యాంగ్రీ యంగ్‌మాన్‌ రాజశేఖర్‌ మధ్య మరోసారి విభేదాలు వచ్చాయి. మా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఈ వివాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్‌ చిరంజీవి ప్రసంగానికి మా వైస్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌ పదేపదే అడ్డుపడ్డారు. చిరంజీవి మాట్లాడుతూ.. మంచి మైకులో చెబుదాం..చెడు చెవిలో చెబుదామని పిలుపునిచ్చారు. చిరంజీవి ప్రసంగం కొనసాగుతుండగానే పలుమార్లు రాజశేఖర్‌ అడ్డుపడటమే కాక పరుచూరి గోపాలకృష్ణ వద్ద నుంచి మైక్‌ లాక్కున్నారు. వేదికపైన రాజశేఖర్‌ ప్రవర్తనతో ఇబ్బంది పడిన చిరంజీవి ఈ కార్యక్రమాన్ని రసభాస చేయడానికే రాజశేఖర్‌ ముందుగా ప్లాన్‌ చేసుకు వచ్చారేమా అనిపిస్తోందని అన్నారు. మీడియా ముందు గోడవలు సరికాదని చిరంజీవి హితవు పలికారు. పెద్దలకు గౌరవం లేనప్పుడు తాము ఇక్కడ ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/