రేపు విజయవాడ పర్యటనకు పవన్ కల్యాణ్

రాష్ట్రంలో పరిస్థితులపై చర్చ

అమరావతి : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపు విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. ఎల్లుండి జులై 7న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించనున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు, జాబ్ క్యాలెండర్ తదితర అంశాలపై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. తిరుపతి ఉప ఎన్నిక అనంతరం పార్టీలోని అంతర్గత పరిస్థితులపైనా పవన్ దృష్టి సారించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/