బింబిసార హిట్ ఫై స్పందించిన మెగాస్టార్

గత కొద్దీ రోజులుగా థియేటర్స్ కు ప్రేక్షకులు రాకపోవడం తో చిత్రసీమ అంత కూడా అయోమయంలో పడిపోయింది. ఇక ప్రేక్షకులు థియేటర్స్ కు రాకపోవచ్చని అంత మాట్లాడుకుంటున్న సమయంలో నిన్న విడుదలైన బింబిసార , సీతారామం చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టడంతో చిత్రసీమ ఊపిరి పీల్చుకుంది. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండ థియేటర్స్ కు వస్తారని రుజువైంది.

ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి రెండు చిత్రాల యూనిట్ కు అభినందనలు తెలిపారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటని, మరింత ఉత్సాహాన్నిస్తూ.. కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలైన చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా ‘సీతారామం’ మరియు ‘బింబిసార’ చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనఃపూర్వక శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు. అలాగే లైగర్ హీరో విజయ్ దేవరకొండ సైతం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఒకే రోజు విడుదలైన రెండు చిత్రాలు హిట్‌ టాక్‌ని సంపాదించుకోవడం సంతోషంగా ఉందని విజయదేవరకొండ ట్వీట్‌ చేశాడు.