దేశంలో కొత్తగా 19,406 కరోనా కేసులు

యాక్టివ్​ కేసులు.. 1,34,793

corona virus

న్యూఢిల్లీః దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం మధ్య 19,406 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 4.96 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 19,928 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి. భారత్​లో శుక్రవారం 32,73,551 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 205.92 కోట్లు దాటింది. మరో 3,91,187 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,97,544 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,953 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,74,35,147కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,33,539 మంది మరణించారు. ఒక్కరోజే 9,39,950 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,80,33,772కు చేరింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/