‘రోబరి ‘ మూవీ ట్రైలర్

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో రిలీజ్

'Robbery' Movie Trailer release event
‘Robbery’ Movie Trailer release event


సుదర్శన్ మూవీ మేకర్స్ పతాకంపై యస్.యన్. నాయుడు, యస్.ఏ.నరసమ్మ సమర్పణలో యస్.శ్రీనివాస్ దర్శక నిర్మాతగా, యస్.సుధీర్ సహనిర్మాతగా అభిషిక్త్, సమ్మోహన హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ రోబరి ‘. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో జరిగింది.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ ట్రైలర్ బాగుంది. ఈ చిత్రం విజయం సాధించి దర్శక నిర్మాతలకు, హీరో హీరోయిన్ కు మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను’ అన్నారు. మరో అతిథి ఏ.పి.ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ ‘ ఎన్నో సంవత్సరాలుగా సినిమాను నమ్ముకొని వున్న వ్యక్తి శ్రీనివాస్ అని, ఈ సినిమా విజయంతో అతని చిరకాల కోరిక నెరవేరి మరెన్నో చిత్రాలను నిర్మించాలని కోరారు. 

  దర్శక, నిర్మాత యస్.శ్రీనివాస్ మాట్లాడుతూ ‘  నా అభిమాన హీరో శ్రీకాంత్ గారి చేతులమీదుగా నా రోబరి సినిమా ట్రైలర్ లాంచ్ జరగడం నా అదృష్టమని, ఈ అవకాశాన్ని నాకు కల్పించిన శ్రీమిత్ర చౌదరి గార్కి, మోహన్ గౌడ్ గార్కి నేను ఋణపడి వుంటానని, శ్రీకాంత్ గారిది లక్కీ హ్యాండని, ఆ లక్కీ మాకు కూడా కలిసివస్తుందని ఆశిస్తున్నామని’ తెలిపారు. 

 హీరో అభిషిక్త్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా నాకు హీరోగా మంచి పేరు తెచ్చి పెడుతుందని, దర్శక నిర్మాత శ్రీనివాస్ గారు ఎక్కడా రాజీ పడకుండా మాతో నటింపజేశాడని’ తెలిపారు.    ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీమిత్ర చౌదరి, నారాయణరావు, పెరుగు వెంకటేష్, మిత్తాని ఈశ్వర్, రాయిపాటి నాగేశ్వర్, దొరబాబు, మణికంఠ పాల్గోన్నారు.    

 యస్.శ్రీనివాస్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, ఫైట్స్: మల్లేశ్ – దేవరాజ్, డైలాగ్స్: నండూరి వీరేశ్, కెమెరా: యాదగిరి, ఎడిటింగ్: అనిల్ కుమార్.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/