ప్లాస్మా సంజీవని వంటిది..చిరంజీవి

ప్లాస్మా దాతలకు సత్కార కార్యక్రమంలో మెగస్టార్‌

chiranjeevi-attended-in-proggram

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ లో ప్లాస్మా డోన‌ర్ల స‌న్మాన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా 150 మంది ప్లాస్మా డోన‌ర్ల‌ను చిరంజీవి, సీపీ సజ్జ‌నార్ తో క‌లిసి స‌న్మానించారు. క‌రోనా లాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో ప్లాస్మా అనేది సంజీవ‌నిలా ప‌నిచేస్తుంద‌ని చిరంజీవి అన్నారు. ప్లాస్మా దాత‌ల‌కు చిరంజీవి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. క‌రోనా పాజిటివ్ వ‌చ్చి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాల‌ని కోరారు, ప్లాస్మా దానంతో చాలా మంది ప్రాణాలు కాపాడినవాళ్ల‌మవుతామ‌ని అన్నారు .

కరోనాను జయించిన 3 నెలల్లోపే ప్లాస్మాను డొనేట్ చేయాల్సి ఉంటుందని, ప్లాస్మా యోధులు.. ప్రాణ దాతలంటూ సజ్జనార్ కొనియాడారు. ప్లాస్మాదానం చేసిన వారిని స‌త్క‌రించ‌డం సంతోషంగాఉంద‌ని సీపీ సజ్జ‌నార్ చెప్పారు. .రక్త‌దానం చేసేలా అభిమానుల‌ను ప్రోత్స‌హించాను. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స‌హ‌కారంతో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ సేవ‌లు కొన‌సాగుతున్నాయ‌ని.. బ్ల‌డ్ బ్యాంక్‌కు అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ముందుండి పోరాడుతున్న పోలీసులు, డాక్ట‌ర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి ధ‌న్యవాదాలు తెలియ‌జేస్తున్నాన్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/