ప్రకాశం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కారణంగా ఒకరు మృతి!

కోవిడ్ చికిత్సకు స్టెరాయిడ్స్ వాడకం వల్ల దుష్ప్రభావం?!

black fungus-
black fungus-

Prakasam District: ప్రకాశం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కారణంగా ఒకరు మృతిచెందినట్టు తెలిసింది. పేరాలకు చెందిన ఒక వ్యక్తికి 10 రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అపుడే బ్లాక్ ఫంగస్ సోకిందని తెలిసింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితునికి శస్త్రచికిత్సతో దవడను తొలగించి వెంటిలేటర్ మీద ఉంచారు. సోమవారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. కోవిడ్ చికిత్సకు స్టెరాయిడ్స్ వాడకం కొంత దుష్ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు. కాగా , ఒంగోలులో ఒకరు, మార్కాపురంలో ఐదుగురు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారని తెలిసింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/