పవన్ కళ్యాణ్ పొలిటిషన్ గా ఉండడమే ఇష్టమన్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మరోసారి పవన్ కళ్యాణ్ రాజకీయాల ఫై స్పందించారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా ఉంటామని తెలిపిన చిరు..తాజాగా పవన్ కళ్యాణ్ యాక్టర్ గా కంటే పొలిటిషన్ గా ఉండడమే ఇష్టమన్నారు. ఇటీవల ఓటిటి లకు ఎంత డిమాండ్ పెరిగిందో చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమాలే కాదు పలు టాక్ షోస్ , డాన్స్ షోస్ , ఇంటర్వూస్ ఇలా సరికొత్త కార్యక్రమాలు చేస్తూ అలరిస్తున్నారు. తెలుగు ఓటిటి ఛానల్ ఆహా లో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె’ షో సూపర్ సక్సెస్ కావడం తో మిగతా ఓటిటి చానెల్స్ సైతం ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ‘సోనీ లీవ్’ కూడా కొత్తగా ‘హాయ్ రబ్బా’ ఫేమ్ స్మిత హోస్ట్ గా ‘నిజం విత్ స్మిత’ పేరుతో ఓ సెలబ్రిటీ షో మొదలుపెట్టింది.

ఫస్ట్ ఎపిసోడ్ ఈరోజు ఫిబ్రవరి 10 నుండి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఈ షో లో చిరంజీవి ని స్మిత అనేక ప్రశ్నలు అడిగి సమాదానాలు రాబట్టింది. ఇందులో పవన్ కళ్యాణ్ గురించి కూడా ఓ ప్రశ్న వేశారు. పవన్ కళ్యాణ్ యాక్టర్ గా ఇష్టమా..? పొలిటిషన్ గా ఉండడం ఇష్టమా..? అని చిరంజీవి ని అడుగగా..చిరంజీవి పొలిటిషన్ గా ఉండడమే ఇష్టమన్నారు. చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ తన ముందు ఏ అన్యాయం జరిగిన ఊరుకునే వాడు కాదు..అలాగే ఎవరు ఆపదలో ఉన్న వారికీ సాయం చేసేందుకు ముందుంటాడు. ప్రజలకు ఏదో మంచి చేయాలనీ ఎప్పుడు తపన పడుతుంటాడు. అందుకే పవన్ పొలిటిషన్ ఉంటె ఇష్టమని తేల్చి చెప్పారు.