ఒక పదవి కోసం ఇంత దిగజారిపోవాలా..? – చిరంజీవి

ఒక పదవి కోసం ఇంత దిగజారిపోవాలా..? - చిరంజీవి

మా ఎలక్షన్స్ ప్రచారం ఏ రేంజ్ లో జరిగాయో తెలియంది కాదు..రాజకీయ ఎన్నికలను తలపించేలా ఈసారి మా ఎన్నికలు జరిగాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలిచారు. కేవలం ప్రచారం లోనే కాదు పోలింగ్ లోను రసాభాస చేసారు. బూతులు తిట్టుకుంటూ ..చేతులు కొరుక్కోవడం వంటివి చేసారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మా ఎన్నికల ఫై కాస్త ఆగ్రహం..అసంతృప్తి వ్యక్తం చేసారు.

ఆదివారం రాత్రి పెళ్లి సందడి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి పలు వ్యాఖ్యలు చేశారు. అల్లర్లతో ’మా‘ పరువు తీయోద్దని సున్నితంగా హెచ్చరించారు. చిన్న చిన్న పదవుల కోసం ఇగోలకు పోవద్దు. వీటి కోసం మాటలు అనడం, అనిపించుకోవడం అవసరమా అని అన్నారు. పదవులు తాత్కాలికం మాత్రమే అని రెండు ఏళ్లు ఉండే పదవుల కోసం వివాదాలు తెచ్చుకోవద్దని కోరారు.

మనమంతా వసుదైక కుటుంబంగా ఉండాలని చిరంజీవి అన్నారు. వివాదాలు పుట్టించిన వ్యక్తులకు దూరంగా ఉండాలని కోరారు. మనం మనం గొడవులు పెట్టుకుని ఇతరుల ముందు చులకన కావద్దన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృత్తం కాకూడదని అన్నారు. పరిశ్రమలో వివాదాలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఉండవని చిరంజీవి అన్నారు. ఇలాంటి ఘటను చూసినప్పుడు బాధ అనిపిస్తుందని అన్నారు. మన అధిపత్యం చూపించుకోవడం కోసం ఇతరులను కించపరచాలా..? అని అన్నారు. ఇండస్ట్రీలో ఆప్యాయంగా, ఆత్మీయంగా ఉండాలని కోరారు. ఇక మా ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించారు.