కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
భారత్ కన్నా పాక్, ఆఫ్ఘన్ బెటర్ .. రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్రం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కరోనా నియంత్రణలో భారత్ కన్నా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు బెటర్‌గా పనిచేశాయన్నారు. ఇవాళ తన ట్విట్టర్లో ఓ పోస్టు చేసిన రాహుల్ గాంధీ.. భారత ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ ఇచ్చిన అంచనాలను ప్రస్తావించారు. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 10.3 శాతం కుంచించుకుపోతుందని ఐఎంఎఫ్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీన్ని ప్రస్తావిస్తూ బిజెపి ప్రభుత్వం అద్భుతమైన ఘనత సాధించినట్లు ఆయన విమర్శించారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చిన వృద్ధి అంచనాలకు సంబంధించి గ్రాఫ్‌ను ఆయన తన ట్వీట్లో పోస్టు చేశారు. ఆ గ్రాఫ్‌లో బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, చైనా, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా దేశాల లెక్కలు ఉన్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/