మా ఎలక్షన్స్ లో మంచు విష్ణు విజయం

  • ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 11మంది ఈసీ సభ్యులుగా గెలుపొందగా.. విష్ణు ప్యానల్ నుంచి ఏడుగురు ఈసీ సభ్యులుగా గెలుపొందారు.

ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ : ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ గెలుపు

సంబరాల్లో విష్ణు ప్యానల్ సభ్యులు..పోలింగ్ బూత్ బయట మంచు అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

ప్రకాష్ రాజ్ ఫై భారీ మెజార్టీ తో విష్ణు విజయకేతనం

ప్రకాష్ రాజ్ ఫై మంచు విష్ణు గెలుపు

మా ఎలక్షన్స్ లో మంచు ప్యానల్ విజయం

శ్రీకాంత్ ఫై బాబు మోహన్ ముందంజ

మా జనరల్ సెక్రటరీ గా ఇరు వర్గాల నుంచి జీవిత, రఘుబాబు పోటీపడ్డారు.  ప్రకాష్ రాజ్ ప్యానల్ పై జీవిత పై విష్ణు ప్యానల్ పై రఘుబాబు గెలుపొందారు.

కేవలం ఏడు ఓట్ల తేడాతో జీవితపై రఘుబాబు విజయం

విష్ణు ప్యానల్ ట్రెజర్ శివబాలాజీ ముందంజ

ఇక ఎగ్జిటివ్ ప్రెసిడెంట్, ట్రెజర్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనది. బాబూమోహన్, శ్రీకాంత్ లు పోటీలో ఉన్నారులు.. విష్ణు ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీ గా పోటీలో ఉన్న రఘు బాబు ముందంజలో ఉన్నారు.

విష్ణు ప్యానల్ నుంచి జయవాణి , పూజిత, మాణిక్ , హరినాథ్, శ్రీలక్ష్మి, పసుమూరి శ్రీనివాస్, శశాంక్, లీడ్ లో ఉన్నారు.

ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శివారెడ్డి, కౌశిక్ , సురేష్ కొండేటి, అనసూయ లు విజయం సాధించారు. శివారెడ్డి భారీ ఆధిక్యంతో సంపూర్ణేష్ పై విజయం సాధించారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఫ్యానల్ లో ఈసీ మెంబర్స్ లో నలుగురు గెలుపొందారు. ఇక ఇప్పటి వరకూ విష్ణు ఫ్యానల్ నుంచి బోణీ కొట్టాల్సి ఉంటుంది.

భారీ మెజారిటీ దిశగా అనసూయ

ఈసీ సభ్యుల కౌంటింగ్ పూర్తీ

కాసేపట్లో 18 మంది ఈసీ సభ్యుల ఫలితాలు…

12 మంది ప్రకాష్ రాజ్ సభ్యులు ముందంజ

మంచు ప్యానల్ సభ్యుల్లో ఆరుగురు ముందంజ..

యాంకర్ అనసూయ ముందంజ

‘మా ‘ ఎన్నికల తొలి ఫలితం వచ్చేసింది. ప్రకాష్ రాజ్ ఈసీ సభ్యులు శివ రెడ్డి , కౌశిక్ గెలుపు

‘మా ‘ ఎన్నికల తొలి ఫలితం కాసేపట్లో వెలువడనుంది. ఈసీ మెంబర్స్ లో ప్రకాష్ రాజ్ ఫ్యానల్ మెజార్టీ లో కొనసాగుతుంది. ఇక మరో వైపు పోస్టల్ బ్యాలెట్ లో మంచు విష్ణు మెజారిటీ లో ఉన్నారు. దీంతో ఫలితాల ఫై ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ సారి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఇరు వర్గాల్లోనూ టెన్షన్ నెలకొంది. పోలైన ఓట్లలో 50 ఓట్లు చెల్లనవిగా తెలుస్తోంది.

మా ఎన్నికల ఓటింగ్ సమయంలో హేమ యాక్టర్ శివ బాలాజీ చేతిని కొరకడంతో చిన్న గాయం అయింది, దీంతో నిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన శివబాలాజీ.. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నారు. అక్కడ టీటీ ఇంజెక్షన్ చేయించుకున్నారు. తిరిగి మా ఎన్నికల కౌటింగ్ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక గతంలో ఎన్నడూను లేనివిధంగా ఈ సారి మా సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మురళీమోహన్‌, మోహన్‌బాబుల సమక్షంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.