దళితుడి ఇంటికి చినజీయర్ స్వామి శంకుస్థాపన

చినజీయర్ స్వామి నేడు విజయనగరం జిల్లాలో ఓ దళితుడి ఇంటికి శంకుస్థాపన చేయబోతున్నారు. జిల్లాలోని గంట్యాడ గ్రామానికి చెందిన చేపల గణేశ్ అంధుడు. చినజీయర్ స్వామి ట్రస్టు ఆధ్వర్యంలోని అంధుల పాఠశాలలోనే చిన్నప్పటి నుంచి డిగ్రీ వరకు చదువుకున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న గణేశ్ 100 మంది చిన్నారులకు భగవద్గీత కూడా నేర్పించాడు.

ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం చినజీయర్ స్వామి గంట్యాడలో గీతా పారాయణం నిర్వహించారు. కాగా, గణేశ్‌కు ఇటీవల ప్రభుత్వం స్థలం మంజూరు చేయగా ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. విషయాన్ని ఆయన చినజీయర్ స్వామికి చెప్పడంతో శంకుస్థాపన చేసేందుకు వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు చినజీయర్ స్వామి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్టు గణేశ్ తెలిపాడు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి గురించి చెప్పాలిన పనిలేదు. 23 సంవత్సరాల వయసులో ఐహిక సుఖములను త్యజించి సన్యాసిగా మారతానని ప్రమాణం చేసారు, దీని పర్యవసానంగా జీయర్ అయ్యారు. సన్యాస స్వీకరణ తర్వాత కొన్నేళ్లకు గీతాజ్యోతి ఉద్యమాన్ని చేపట్టారు. గీతాజ్యోతి ఉద్యమం కేవలం భగవద్గీత ప్రాచుర్య రూపకాన్నే కాక, సమాజంలో ఉన్న సోమరితనాన్ని తొలగించే, సౌభ్రాతృత్వ భావనను ప్రతి ఒక్కరిలో మేల్కొల్పగలిగే వ్యూహంగా కూడా రూపుదిద్దుకుంది. ఆ ఉద్యమ రూపకల్పన తర్వాత ఎంతోమంది మాకు అద్భుతమైన ఖాళీ సమయం దొరుకుతుంది, ఇప్పుడు మేము ఆ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొనగలుగుతున్నామని చెప్పడం గమనార్హం. అక్కడితో స్వామివారు వారి కర్తవ్యం పూర్తి అయిందని అనుకోలేదు. అంధులను చేరదీసి వారు కళ్లు లేకున్నా…. కంప్యూటర్ విద్యలో గొప్ప నిపుణులు అవ్వాలని, ఎన్నో చోట్ల కాలేజీలని స్థాపించారు. అక్కడ అంధులకు శిక్షణనిచ్చేటందుకు, కొందరు నిపుణులను నియమించారు.

వేదం అనగా విశ్వకోటికి విజ్ఞానాన్ని అందించేది, మోక్ష సాధనకు పునాది అయిన విద్య వేదం. అలాంటి వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి, ఎన్నో ఆశ్రమాలను స్థాపించారు స్వామివారు. విద్య అనేది ఒక వర్గానికో, వర్ణానికో కాక, మానవాళికంతటికి అందాలనే ఉద్దేశంతో ఆ వేద పాఠశాలలనే గురుకుల పాఠశాలలుగా మలచి, అన్ని రకాల విద్యలనీ బోధించే సౌకర్యాన్ని ఆ పాఠశాలల్లో కల్పించారు12నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. దీన్నిబట్టి స్వామివారి పట్టుదల, స్వామివారికి విద్యపై ఉన్న గౌరవం, ప్రేమ అర్థం చేసుకోవచ్చు. ధార్మిక సైనికులను తయారు చేయడంలో, కీలకపాత్ర పోషించారు. . శ్రీరామ నగరం, శంషాబాద్ లో జిమ్స్ అనేటటువంటి ఒక ఆస్పత్రిలో ఉచిత వైద్య విధానాన్ని ప్రవేశపెట్టి, వైద్యరంగ పరమైన అనుగ్రహాన్ని కూడా స్వామివారు సమాజంపై చూపినారు. అయితే….. మరలా సోమరితనపు ఛాయలు కమ్ముతున్న సమయంలో శాంతి సుందరం కార్యక్రమం నిర్వహించారు. ఆ పిదప ఎన్నో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలనిర్వహణ జరిగాక, రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహణ చేస్తున్నారు.