చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో తాబేలు పిల్ల‌

తాబేలు పిల్లకు ఆహారం తినిపించిన చినజీయర్ స్వామి

tortoise-at-chinna-jeeyar-swamy-ashram

హైదరాబాద్‌: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, హైందవ ప్రచారకర్త చినజీయర్ స్వామి ఇటీవలే శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం క్షేత్రాన్ని దర్శించుకుని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని తమ ఆశ్రమానికి వచ్చారు. అయితే ఆయన ఆశ్రమానికి తిరిగొచ్చిన కొన్నిరోజులకే ఓ తాబేలు పిల్ల ఆశ్రమంలోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన చినజీయర్ స్వామి విస్మయానికి గురయ్యారు. అంతేకాదు, ఆ తాబేలును ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తూ, స్వయంగా ఆయనే దానికి ఆహారం తినిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆశ్రమ వర్గాలు విడుదల చేశాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/