దేవుడు దీవెనల వల్లే నాకు కరోనా వచ్చింది

వాషింగ్టన్: దేవుడి దీవెనల వల్లే నాకు కరోనా వచ్చింది అనుకుంటున్నా అన్ని ట్రంప్ పేర్కొన్నారు. మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి కోలుకున్న తర్వాత ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కరోనా తనకు ‘దేవుని ఆశీర్వాదం’ అని భావిస్తున్నానన్నారు. అందువల్లే దాన్ని నయం చేసే శక్తిమంతమైన డ్రగ్స్ గురించి తనకు తెలిసిందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ మందులను ఉపయోగించడం వల్ల అది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తన అనుభవంలోకి వచ్చిందన్నారు. అమెరికా పౌరులకు కూడా ఇదే స్థాయిలో ఉచితంగా చికిత్స అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు కరోనా విస్తరణపై డ్రాగన్ దేశంపై ఇప్పటికే పలుమార్లు మండిపడిన ట్రంప్ మరోసారి తన దాడిని ఎక్కు పెట్టారు. ప్రపంచానికి చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. చైనా చేసిన వైరస్‌కు అమెరికన్లు డబ్బులు చెల్లించాల్సిన పనిలేదంటూ విరుచుకుపడ్డారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/