చైనాను వణికిస్తున్న కొత్త వైరస్‌

Deadly Virus attacking in china
Deadly Virus attacking in china

బీజింగ్‌: చైనా ప్రపంచ దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రస్తుతం వినిపిస్తుంది. అయితే అది ఇండియా కంటే మెరుగ్గా ఉందని మనందరం అనుకుంటూ ఉంటా. కానీ అందులో కొంతమేరకు మాత్రమే నిజం ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయంతో చైనాకు కూడా ఎన్నో సమస్యలున్నాయని అర్థం అవుతుంది. అయితే చైనాకు వచ్చిన సమస్యలేంటి అని అనుకుంటున్నారా? ప్రధానంగా అడ్డమైన రోగాలకూ చైనా కేంద్రమవుతోంది. మీరు గమనిస్తే… వచ్చిన ఎన్నో వైరస్‌లు చైనాలో విజృంభించినవే. సార్స్, మెర్స్‌లాగే… ఇప్పుడు కొరోనా అనే కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. అది ఊహించినదానికంటే వేగంగా వ్యాపిస్తోంది. మొత్తం 45 ల్యాబుల్లో వింత వైరస్‌ని గుర్తించారు. 1700 మందికి అది సోకినట్లు తేల్చారు. ఆల్రెడీ చైనాలోని వుహన్ సిటీలో ఇద్దరు ఈ వైరస్ వల్లే చనిపోయారు. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిసింది. వెంటనే లండన్‌లోని కొత్త వైరస్‌లపై పరిశోధనలు చేసే కాలేజీకి శాంపిల్స్ పంపింది. అప్పుడు అర్థమైంది అది కొత్తగా పుట్టిన వైరస్ అని. దానికి కొరోనా వైరస్ అని పేరు పెట్టింది. కొరోనా అంటే క్రౌన్ (కిరీటం) అని అర్థం. ఈ వైరస్‌ని మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు… కిరీటం ఆకారంలో ఉంది. అందుకే దానికి ఆ పేరు పెట్టారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా… ప్రపంచ దేశాల్ని అలర్ట్ చేసింది. వెంటనే అమెరికా, సింగపూర్, హాంకాంగ్ ఇలా చాలా దేశాల్లో విమానాశ్రయాల్లో హెల్త్ చెకప్స్ మొదలయ్యాయి. ఈ వైరస్‌పై భారత్ ఇంకా అలర్ట్ అవ్వలేదు. అయితే … ఈ సమయంలో ఎవరూ చైనాకు వెళ్లకపోవడం మంచిది. ముఖ్యంగా వుహాన్ నగరానికి అస్సలు వెళ్లకూడదు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/