ఏటీఎంలలో పలు రకాల సర్వీసులు

atm services
atm services

హైదరాబాద్‌: ఏటీఎంను ఎక్కువ మంది నగదు తీసుకోవడానికి, తమ ఖాతాలో ఉన్న నిల్వను తెలుసుకోవడానికి వినియోగిస్తుంటారు. కానీ బ్యాంకులు తమ ఏటీఎంలలో పలు రకాల సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి. మొబైల్‌ ఫోన్‌ రీచార్జు కోసం ఏటీఎంను వినియోగించకోవచ్చు. మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి ఆపరేటర్‌ను ఎంచుకున్న తర్వాత ఎంత మొత్తమైతే రీచార్జు అవసరం ఉంటుందో ఆ వివరాలను తెలియజేస్తే రీచార్జు అయిపోతుంది. మీ సొంత నెంబర్‌నే కాకుండా మీ కుటుంబ సభ్యులు నెంబర్లకు కూడా రీచార్జు చేయవచ్చు. ఇంకా ఏటీఎం ద్వారా వివిధ రకాల బిల్లులు కూడా చెల్లించవచ్చు. టెలిఫోన్‌ బిల్లు, విద్యుత్‌ బిల్లు, గ్యాస్‌ బిల్లు, ఇతర వినియోగ బిల్లులను సులభంగా చెల్లించవచ్చు. అయితే బిల్లుల చెల్లింపులకు ముందు బ్యాంకు వెబ్‌సైట్‌లో ముందుగా బిల్లు వసూలు చేసే సంస్థ పేరును రిజస్టర్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి అనుమతి వచ్చిన తర్వాత ఎప్పుడంటే అప్పుడు చెల్లింపులు చేయవచ్చు. ఇంకా పలు రకాల పన్ను చెల్లింపులను కూడా సులభంగా ఏటీఎం ద్వారా చెల్లించవచ్చు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/