అక్కడ 116 ఏళ్ల త‌ర్వాత తీవ్రస్థాయిలో హిమ‌పాతం

బీజింగ్: చైనాలో తీవ్ర స్థాయిలో మంచు కురుస్తోంది. ఈశాన్య ప‌ట్ట‌ణ‌మైన షెన్‌యాంగ్‌లో రికార్డు స్థాయిలో స్నోఫాల్ ప‌డింది. అస‌లే విద్యుత్తు స‌ర‌ఫ‌రాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనాకు ఇప్పుడు మ‌రింత క‌ష్ట‌కాలం వ‌చ్చింది. లియోనింగ్ ప్రావిన్సులో ఉన్న షెన్‌యాంగ్‌లో స‌గ‌టు స్నోఫాల్ 51 సెమీట‌ర్ల‌కు చేరుకున్న‌ది. 1905 త‌ర్వాత ఆ న‌గ‌రంలో కురిసిన అత్య‌ధిక హిమ‌పాతం ఇదే అంటూ చైనా వార్తా సంస్థ తెలిపింది.

మంగోలియాతో స‌రిహ‌ద్దు క‌లిగిన ప్రాంతాల్లో ఒక‌రు మృతిచెందారు. భీక‌ర మంచు తుఫాన్ వ‌ల్ల 5600 మంది ఇబ్బంది ప‌డ్డారు. అక‌స్మాత్తుగా మంచు తుఫాన్ కురుస్తోంద‌ని అధికారులు చెప్పారు. మంగోలియా ప్రాంతంలో మంచు తుఫాన్‌పై 27 సార్లు రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. ఇక కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు మైన‌స్‌కు చేరుకున్నాయి. భారీ మంచు వ‌ల్ల లియానింగ్ ప‌ట్ట‌ణంలో ట్రాఫిక్ స్తంభించింది. అన్ని టోల్స్‌ను మూసివేశారు. రైళ్లు, బ‌స్సుల‌ను ర‌ద్దు చేశారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/