విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై సిఎంకు నివేదిక

Vizag Gas leakage
Vizag Gas leakage

అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనపై నియమించిన హైపవర్‌ కమిటి తన నివేదికను సిఎం జగన్‌కు సమర్పించింది. సిఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం సిఎంని కలిసిన కమిటీ సభ్యులు, గ్యాస్‌ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసి నివేదికను సమర్పించారు. అటవీ పర్యావరణం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ సభ్యులుగా హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మే 7న ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ ప్రమాదం జరిగిన తీరు, భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు మరోసారి పునరావృత్తం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, సలహాలను కమిటీ తన నివేదికలో పొందుపరిచింది. అలాగే ప్రభావిత గ్రామాల బాధిత ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, సీనియర్‌ జర్నలిస్ట్‌లు, అధికారులతో హైపవర్‌ కమిటీ చర్చించింది. నివేదిక సమర్పన సందర్భంగా విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, నగర కమిషనర్‌ ఆర్కే మీనా పాల్గొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/