చైనా లో భూకంప ఘటన లో 46 కు చేరిన మృతుల సంఖ్య

చైనా సిచువాన్‌లో సోమవారం సంభవించిన భారీ భూకంపం ఘటన లో మృతుల సంఖ్య 46 కు చేరింది. రిక్టర్ స్కేల్​పై తీవ్రత 6.8గా నమోదైందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 46 మంది చనిపోయారని వెల్లడించారు. సిచువాన్ రాజధాని చెంగ్డూకు నైరుతి దిక్కున 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని, ప్రకంపనల ధాటికి చెంగ్డూలో బిల్డింగ్​లు ఊగిపోయాయని చైనా డైలీ తెలిపింది. చాలాచోట్ల భవనాలు భవనాలు కూలిపోగా.. పలుచోట్ల చిక్కుకున్న 50వేలమందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిచువాన్‌లో 6500 రెస్క్యూ టీమ్‌లను, నాలుగు హెలికాప్టర్లను మోహరించారు.

దీంతో పాటు 1,100 అగ్నిమాపక దళ బృందాలను రంగంలోకి దింపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ 50 మిలియన్ యువాన్లను రెస్క్యూ, రిలీఫ్ ఫండ్‌ను విడుదల చేసింది. ప్రాంతీయ ప్రభుత్వం కూడా గంజికి 50 మిలియన్ యువాన్లను కేటాయించింది. భూకంపం కేంద్రంగా ఉన్న లూడింగ్ కౌంటీకి సహా సహాయక సామగ్రిని కేటాయించారు. 2008లో చైనాలో 8.2 తీవ్రతతో భూకంపం సంభవించగా.. 69వేలమందికిపైగా మృత్యువాతపడ్డారు. 18వేల మందికిపైగా మరణించారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో భూకంపానికి సంబదించిన వీడియోస్ వైరల్ గా మారాయి.