సైనా నెహ్వాల్ కు క్ష‌మాప‌ణలు చెప్పిన హీరో సిద్ధార్థ్

హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపియన్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్దార్థ్ చేసిన ట్వీట్ ఎంత వైరల్ అయ్యిందో తెలియంది కాదు. బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ చేసిన ఒక ట్వీట్ కు సిద్ధార్థ్ రిప్లే ఇస్తు.. ఒక‌ అస‌భ్య‌క‌రమైన ప‌దాన్ని వాడారు. దీంతో ఆ ట్వీట్ పెను దూమారాన్ని లేపింది. ఈ క్రమంలో సిద్దార్థ్ ..సైనా నెహ్వాల్ కు క్ష‌మాప‌ణలు చెప్పాడు.

‘డియర్ సైనా’.. అని మొదలు పెడుతూ రాసిన ఓ లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. తానో అసభ్యకరమైన జోక్ చేశానని, అందుకు క్షమించాలని వేడుకున్నాడు. మీ ట్వీట్‌కు తాను స్పందించిన తీరు, వాడిన భాష సరికాదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అయితే, అది తాను దురుద్దేశంతో చేసిన ట్వీట్ కాదని, మహిళలంటే తనకు ఎనలేని గౌరవమని చెప్పుకొచ్చాడు. తన ట్వీట్‌లో లింగ వివక్ష ఏమీ లేదని, మీరు మహిళ కాబట్టి దాడి చేయాలన్న ఉద్దేశం తనకు ఎంతమాత్రమూ లేదని, కాబట్టి ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెడదామని కోరాడు. మీరెప్పుడూ నా చాంపియనేనని, తన క్షమాపణలు అంగీకరిస్తారని ఆశిస్తున్నానంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. మరి సిద్దార్థ్ లెటర్ ఫై సైనా ఎలా స్పందింస్తుందో చూడాలి.