పిల్లల గదులు సౌకర్యంగా..ప్రత్యేకంగా

పిల్లల మానసిక వికాసం

Children’s rooms are comfortable .

ఇంటికి వచ్చింది మొదలు చిన్నారులకు చదువూ, హోంవర్క్‌తోనే సరిపోతుంది. అలాంటప్పుడు పిల్లల గదిని ప్రత్యేకంగా ఉంచాలి. చదువు మీద ఆసక్తిని పెంచుతూ మానసిక వికాసానికి దోహదపడేలా చూసుకోవాలి.

పిలల గదిలో గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా చూడాలి. అలాగే విద్యుత్‌ బల్బుల విషయంలో అవి కాస్త బాగా కాంతిమంతంగా వెలిగేవి అమర్చాలి. అలాకాకుండా కాస్త వెలుగు తగ్గితే గదిలో కాంతివిహీనంగా అనిపిస్తుంది.

ఆ ప్రభావం మనసుపై పడుతుంది. మనసులో ఒక నిర్లిప్తత ఏర్పడుతుంది. కిటికీ లేదంటే ఒక పక్కన టేబుల్‌ మీద పచ్చని మొక్కను ఏర్పాటు చేయాలి. అది ఆక్సిజన్‌ను అందించడమే కాదు.

మనసులో సానుకూల ఆలోచనలకు దోహదం చేస్తుంది. దాంతోపాటు తాజా పువ్వులతో వాజ్‌ను కూడా ఉంచితే తెలియకుండానే మనసును ఆ పువ్వులూ, వాసనా ఉత్తేజితం చేస్తాయి. గదిలో లేత రంగులు కాకుండా ముదురువి ఎంచుకోవాలి.

ప్రకాశవంతంగా కనిపించే రంగులు మెదడు చురుగ్గా ఉండటానికి సాయపడతాయి. అందుకు దుప్పటి, దిండు గలేబులూ, కర్టెన్లూ, కార్పెట్‌ ఇలా అన్నీ రంగులమయంగా ఉండేలా చూడాలి. పిల్లల గదిలో పుస్తకాల అల్మరా తప్పనిసరిగా ఉండాలి.

అందులో ఆసక్తికరంగా అనిపించే పుస్తకాలను అమర్చి ఉంచాలి. వారికి ఎదురుగా కనిపిస్తున్నప్పుడు తీసి చదువుతారు. పజిల్స్‌, పుస్తకాలు,రూబిక్స్‌ క్యూబ్‌, చదరంగం, ఇలా ఇండోర్‌ గేమ్‌లకు సంబంధించినవి ఒక అరలో ఉంచాలి.

ఇవన్నీ పిల్లల మెదడుకు మేతలాంటివి. ఆలోచనా శక్తినీ, చురుకుదనాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/