శొంఠితో ఎన్నో ప్రయోజనాలు

వంటింటి చిట్కాలు

శొంఠి పొడి వేసి టీ కాస్తే… ఆ రుచి భలే పసందుగా ఉంటుంది.. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కూడా.. ఇవే కాదు.. శొంఠి తో మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయండోయ్.

రోజూ కాసింత శొంఠి పొడిని ఆహారంలో చేర్చుకుంటే నెలసరి సమయంలో అధిక రక్తస్రావం తో బాధ పడే వాళ్లకు చక్కని ఉపశమనం దొరుకుతుంది.. మొదటి మూడు రోజులు శొంఠి వేడి చేసిన అన్నం తింటే నొప్పి కూడా తగ్గుతుంది..
కాళీ పిక్కలు పట్టేయటం, కండరాల నొప్పులతో బాధపడటం వంటి సమస్యలుంటే ఇది మంచి ఔషధం..

కొవ్వుని కరిగించటంలో శొంఠి ముందుంటుంది.. ట్రీగ్లిజ రాయిడ్ సమస్యతో బాధపడేవారు కొన్ని రోజులు శొంఠి టీ తాగితే చక్కని ఫలితం కన్పిస్తుందట .
శరీరం లోపలి వాపులకు, కీళ్ల దగ్గర పట్టేసినట్టుగా ఉన్నా ఇది మేలు చేస్తుంది..

మరిన్ని ఆరోగ్య విషయాల కోసం ‘నాడి ‘ క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/specials/health1/