కట్టు చారు

రుచి: వంటల తయారీ విధానం

kattu Chaaru

కట్టు చారు : కావలసిన వస్తువులు

పప్పుకట్టు- 2 గ్లాసులు
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 2
ఎండుమిర్చి – 3
ఆవాలు, జీలకర్ర – 1/4 టీ స్పూన్‌
కరివేపాకు – 2 రెబ్బలు
కొత్తిమీర – కొద్దిగా
వెల్లుల్లి – 4 రెబ్బలు
ఇంగువ – చిటికెడు
ఉప్పు – తగినంత –
నూనె – 3 టీస్పూన్‌లు

తయారు చేసే విధానం

కందిపప్పు ఉడకపెట్టేటప్పుడు వచ్చే నీళ్లను కట్టు అంటారు. లేదా గరిటెడు పప్పు మెత్తగా ఉడికించి మెదిపి నీళ్లు పోసి పలుచగా చేసుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత సన్నాగా తరిగిన ఉల్లిపాయ, నలక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించి పప్పుకట్టుపోయాలి. ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసి కొద్దిసేపు మరిగించి దింపేయాలి. చివరలో కొంచెం నెయ్యి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/