వయసుకు మించి మాట్లాడుతుంటే..

పిల్లలు పెంపకం

children Speaking beyond age
children Speaking beyond age

టివిలూ, సినిమాల ప్రభావం కొంత, ఇంట్లో పరిస్థితులు ఇంకొంత… కొందరు చిన్నారులు వయసుకు మించి మాట్లాడేస్తుంటారు. ఈ మాటలు మొదట్లో ముద్దుముద్దుగా అనిపించినా.. కొన్నాళ్ల తర్వాత అసహనం కలిగిస్తాయి.

నలుగురిలో పిల్లల ప్రవర్తన ఇబ్బంది కలిగించవచ్చు. దీన్ని నియంత్రించాలంటే.. ఈ సూచనలు పాటించి చూడండి.

  • పిల్లల్ని కూర్చో బెట్టి ఆటలు ఆడిం చడం, కథలు చెప్పడం తగ్గించేశాం. దాంతో కాస్త ఖాళీ దొరికినా టివికి అతుక్కుపోతున్నారు.
  • టివిలో వినిపించే మాటలే వాళ్లు ఒంటపట్టించుకుంటున్నారు. దాంతో ఎక్కువగా మాట్లాడేస్తుంటారు. అతిగా ప్రవర్తిస్తుంటారు.
  • పిల్లల ప్రవర్తనను గమనించాల్సి బాధ్యత పెద్దలదే నియమిత సమయంలోనేటివి చూసేలా కట్టడి చేయాలి. వారికి సరైన వ్యాపకం ఉండేలా చూసుకోవాలి.
  • పుస్తకాలు చదివిండం, నీతి కథలు చెప్పడం, మెదడుకు పదును పెట్టే పిజిల్స్‌ చేయించడం.. ఇవన్నీ చిన్నా రుల్లో మార్పు నకు దోహదం చేస్తాయి.
  • వయసుకిమించిన మాటలు పిల్లల్లో మేధస్సుకు గుర్తింపేడుకోవొచ్చు. కానీ, అవి సున్నితంగా, సానుకూలంగా ఉంటేనే మేలు.
  • అన్నీ తెలుసు అన్నట్లుగా ప్రవర్తించినా, అనవసరమైన పేచీలకు దిగినా.. వారి చురుకుతనం దారి తప్పుతోందని గుర్తించండి.
  • మొదటి నుంచే వాస్తవి కతకు, ఊహకు మధ్య తేడాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.
  • అప్పుడు వారి ప్రవర్తన వాస్తవికతకు దగ్గరకు ఉంటుంది. పిల్లలు మాట్లాడేటప్పుడు తప్పొప్పులను ఎప్పటికప్పుడు సరిచేయడం మంచిది.
  • అలానే పెద్దల మాటలను పిల్లలు అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే వారి ముందు అనవసర పదప్రయోగాలు, వ్యాఖ్యలు చేయొద్దు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/