తలనొప్పిని తగ్గించే పరిమళాలు…

ఆరోగ్యం – చిట్కాలు

Aromas that relieve headache

చాలా మంది తలనొప్పికి ఓ టాబ్లెట్ వేసి ముసుగు కప్పి నిద్రపోతారు. దీనికి బదులుగా , కొన్ని చుక్కల లావెండర్ నూనెను వేడినీటిలో వేసి నోరు, కళ్ళు మూసి ఆవిరి పీల్చాలి. దీని పరిమళం ఒత్తిడిని తద్వారా వచ్చే తలనొప్పి తీవ్రతను తగ్గిస్తుంది .

పుదీనా ఎస్సెన్షియల్ ఆయిల్ ను ఆరోమా థెపీ లో తలనొప్పితో పాటు నరాలు, కండరాల నొప్పికి ఉపయోగిస్తారు. దీన్ని నుదిటిపై రాయటమో, వాసన చూడటమో చేస్తే . తలనొప్పి నుంచి ఉపశమనాన్ని కల్గిస్తుంది.

చర్మ సౌందర్యానికి ఉపయోగించే రోజ్ మేరీ ఆయిల్ కూడా ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఒత్తిడిని తగ్గించి ప్రశాంతను కల్గిస్తాయి.

టెన్షన్ లో ఉన్నపుడు కూడా తలనొప్పి ఎక్కువ వస్తుంటుంది. అలాంటపుడు చమేలీ ఆయిల్ బాగా పనిచేస్తుంది . అందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆందోళన , ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని అందిస్తాయి.