ఎఫ్ 3 లో వెంకీ , వరుణ్ ఎలా కనిపిస్తారో తెలిపిన అనిల్ రావిపూడి

ఎఫ్ 3 లో వెంకీ , వరుణ్ ఎలా కనిపిస్తారో తెలిపిన అనిల్ రావిపూడి

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘ఎఫ్3’ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ఎఫ్2కి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించాలని అనుకున్నప్పటికీ..పెద్ద చిత్రాలు బరిలోకి దిగడం తో ఎఫ్ 3 వాయిదా వేశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ..చిత్ర విశేషాలను పంచుకున్నారు. “ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేద్దామని నేను .. దిల్ రాజుగారు భావించాము. కానీ సోలో రిలీజ్ గా వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాము. ఈ సినిమాలో వెంకటేశ్ – వరుణ్ తేజ్ పాత్రలను డిజైన్ చేసిన తీరు చాలా ఫన్ గా ఉంటుంది.

రేచీకటి గల పాత్రలో వెంకీ .. నత్తి ఉన్న పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సీన్స్ ఒక రేంజ్ వచ్చాయి. థియేటర్స్ లో ప్రేక్షకులు పడి పడి నవ్వుకుంటారు. ‘ఎఫ్ 3’ తరువాత కూడా ఈ ఫ్రాంఛైజీ కొనసాగుతుందని తెలిపారు. అలాగే తెలుగులోని స్టార్ హీరోలందరితోను సినిమాలు చేయాలనుంది” అని చెప్పుకొచ్చాడు.