సెస్ చైర్మ‌న్‌గా చిక్కాల రామారావు

Chikkala Rama Rao unanimously elected as CESS chairman

సిరిసిల్ల ‘సెస్’ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి రైతన్నలు, వినియోగదారులు పట్టం కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారని విజయం సాధించిన వారు చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత జరిగిన తొల్లి ఎన్నికల్లో సెస్‌పై గులాబీ జెండా ఎగుర వేసి సత్తా చాటింది. ఈ విజయం బిఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం నింపింది.

ఇక సెస్‌ చైర్మ‌న్‌గా బీఆర్ఎస్ అభ్య‌ర్థి చిక్కాల రామారావు(తంగ‌ళ్ల‌ప‌ల్లి), వైస్ చైర్మ‌న్‌గా దేవ‌ర‌కొండ తిరుప‌తి(కోన‌రావుపేట‌) ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు సెస్ ఎన్నిక‌ల అధికారి బీ మ‌మ‌త ప్ర‌క‌టించారు. సెస్ చరిత్రలో మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ విశ్వబ్రాహ్మణులకు వైస్ చైర్మన్‌గా అవకాశం క‌ల్పించింది. నిన్న వెల్ల‌డైన సెస్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 15 స్థానాల్లోనూ బీఆర్ఎస్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఒక్క స్థానాన్ని కూడా భార‌తీయ జ‌న‌తా పార్టీ గెలుచుకోలేక‌పోయింది.