ఏపిలో మరో 193 కొత్త పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో 88కి పెరిగిన కరోనా మరణాలు

ఏపిలో మరో 193 కొత్త పాజిటివ్‌ కేసులు
coronavirus -ap

అమరావతి: ఏపిలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. గడచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారు. చిత్తూరులో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 88కి పెరిగింది. కొత్తగా 193 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 5,280కి చేరింది. ఇప్పటివరకు 2,851 మంది డిశ్చార్జి కాగా, 2,341 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా, 81 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/