రాహుల్ బాబా అంటూ ..రాహుల్ యాత్ర ఫై అమిత్ షా విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై కేంద్రమంత్రి అమిత్ షా విమర్శలు చేసారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. అయితే అతను మొదట మన దేశ చరిత్రను అధ్యయనం చేయాలని నేను భావిస్తున్నాను.” అని అన్నారు. అక్కడి తో ఆగకుండా రాహుల్ బాబాకు, కాంగ్రెస్ సభ్యులకు పార్లమెంట్‌లో ఆయన చేసిన ప్రసంగాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. రాహుల్ బాబా భారతదేశం అసలు ఒక దేశం కాదన్నారు. రాహుల్ బాబా.. మీరు దీనిని ఏ పుస్తకంలో చదివారు..? ఈ దేశం కోసం లక్షలాది మంది ప్రజలు తమ జీవితాలను త్యాగం చేశారు అని అమిత్ షా అన్నారు.

ఇక ఈ యాత్ర లో రాహుల్ గాంధీని కలిసిన జార్జ్ పొన్నయ్య అనే మతగురువు కలవడం ఫై కూడా బిజెపి విమర్శలు చేసింది. “శక్తి, తదితరుల వలె కాకుండా ఏసు ప్రభువే నిజమైన దేవుడు… అంటూ రాహుల్ తో జార్జ్ పొన్నయ్య పలికారు. ఈ వ్యక్తి గతంలో హిందువులపై విద్వేషం వెళ్లగక్కి అరెస్టయ్యాడు. అంతేకాదు, భరతమాత అపవిత్రతలు మమ్మల్ని అంటకుండా ఉండేందుకే నేను బూట్లు వేసుకుంటాను అని చెప్పింది కూడా ఇతడే. భారత్ జోడో యాత్ర చేయాల్సింది ఇలాంటి వాళ్లతోనేనా?” అంటూ షెహజాద్ పూనావాలా మండిపడ్డారు.