హాస్పటల్ లో చేరిన ఆర్.కృష్ణయ్య

బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హాస్పటల్ లో చేరారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కార్యాలయం ముందు ధర్నా బిసి సంక్షేమ సంఘం ధర్నా చేపట్టింది. ఈ ధర్నా కార్యక్రమం లో కృష్ణయ్య కూడా పాల్గొన్నారు. మోడల్ స్కూల్స్ లో పని చేసే గెస్ట్ టీచర్స్ ఆందోళన కు మద్దతు తెలుపుతూ.. ఈ కార్యక్రమం లో ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు.

ఈ నేపథ్యం లో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో నాయకులు హుటా హుటిన కృష్ణయ్య ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రవేట్ ఆస్పత్రి లో వైద్యం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక కృష్ణయ్య రాజకీయ విషయానికి వస్తే..1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాడు. ఆయన 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ప్రస్తుతం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు.