బీఆర్ఎస్ కీలక నేత సత్యనారాయణ గౌడ్‌తో కోమటిరెడ్డి భేటీ..

తెలంగాణ లో ముందస్తు ఎన్నికల ప్రచారం నడుస్తున్న క్రమంలో పలువురు నేతలు తమ రాజకీయ భవిష్యత్ ఫై ఆలోచిస్తున్నారు. ఉన్న పార్టీ లో టికెట్ దక్కదు అనుకునే వారు ఇతర పార్టీల ఫై ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం బిజెపి తెలంగాణ ఫై పూర్తి గా ఫోకస్ పెట్టింది. బిఆర్ఎస్ పార్టీ లో ఉన్న పలువురు నేతల ఫై దృష్టి పెట్టారు. తమ పార్టీలోకి ఆహ్వానించి వారికీ టికెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, జిల్లా కీలక నేత సత్యనారాయణ గౌడ్‌తో మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావటం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంమైంది.

. గత కొంత కాలంగా జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో సత్యనారాయణ గౌడ్ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనటం లేదు. దీంతో ఆయన పార్టీ మారనున్నారనే ఉహాగానాలు ఊపందుకున్నాయి.మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజవర్గాన్ని తాను దత్తత తీకుంటానని కోమటి రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజవర్గాల్లోనూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ఎప్పట్నుంచో చెబుతున్నారు. అదే కారణంగా ఆయన సత్యనారాయణ గౌడ్ దంపతులతో బుధవారం భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను సత్యనారాయణ గౌడ్ ఖండిస్తున్నారు. తనకు ఇటీవల కిడ్నీలో రాళ్లకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగిందని ఆ విషయం తెలిసి తనను పరామర్శించటానికే రాజగోపాల్ రెడ్డి తమ ఇంటికి వచ్చారని చెబుతున్నారు.