షర్మిల కొత్త పార్టీ పేరు ఇదేనా?

‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’?
పార్టీ ఏర్పాటుకు అవసరమైన పత్రాలు సీఈసీకి సమర్పణ

హైదరాబాద్: తెలంగాణలో వైఎస్‌ షర్మిల కొత్తగా పెట్టబోయే పార్టీ పేరు వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ(వైటీపీ) గా దాదాపు ఖరారైంది. షర్మిల ముఖ్య అనుచరుడు రాజగోపాల్ ‘వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ’ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రాజకీయ పార్టీని నమోదు చేశారు. షర్మిల స్థాపించబోయే నూతన పార్టీ ఇదేనని ప్రచారం జరుగుతోంది.

కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను రాజగోపాల్ సీఈసీకి సమర్పించారు. పార్టీ రిజిస్ట్రేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16 లోగా తమకు తెలియజేయాలని ఈసీఐ ఓ ప్రకటనలో కోరింది. కాగా, దీనికి సంబంధించి త్వరలోనే షర్మిల అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/