శ్యామ్ ​సింగ రాయ్ ట్రైలర్ విడుదల

నాని , సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ జంటగా రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ ​సింగ రాయ్. భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈనెల 24న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర మేకర్స్ ట్రైలర్ విడుదల చేసి సినిమాపై అమాంతం అంచనాలు పెంచారు.

ఫిల్మ్ డైరెక్టర్ కావాలనుకునే వాసు అనే యువకుడు తన గాళ్ ఫ్రెండ్ నే హీరోయిన్ గా పెట్టి ప్రయత్నాలు చేసే సన్నివేశాలతో ట్రైలర్ మొదలైంది. లోబడ్జెట్ సినిమా చేయాలనేది వాసు కల.. ఇందు కోసం సాఫ్ట్ వేర్ జాబ్ ని వదులుకుని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ ప్రయత్నాల్లో కృతిశెట్టి పై ప్రయోగాలు చేస్తూ వీడియోలు తీస్తుంటాడు. ఇతని షూటింగ్ న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వస్తుంది. మార్కెట్ లో జరిగిన గొడవలో తలపై గాయం కావడంతో వాసుకి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకొచ్చినట్టుగా చూపించిన తీరు కథని రవీల్ చేస్తున్నట్టుగా వుంది.

ఈ క్రమంలో పోలీస్ పాత్రలో మడోన్నా సెబాస్టియన్ ని పోలీస్ ఆఫీసర్గా ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుడు వాసుకు గత జన్మజ్ఞాపకాల్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఓ బెంగాళీ పుస్తకంలోని అక్షరాలని తడుముతూ తదేకంగా ఆలోచిస్తున్నట్టుగా చూపించాడు. హ్యూమన్ కాన్షియస్ ఫుల్ ఆఫ్ ఓసియన్ సీక్రెట్స్ అని ఓ లేడీ వాయిస్ తో చెప్పించడం…ఆ వెంటనే వాసు పాత్ర శ్యామ్ సింగ రాయ్ పేరుని పలకడం.. ఓ గోడపై శ్యామ్ సింగ రాయ్ ఫొటో వున్న ఓ పోస్టర్ ని చూపించిన తీరు ఆ వెంటనే ఆ పాత్రని పరిచయం చేసిన తీరు సినిమా ఓ రేంజ్ లో వుంటుందనే సంకేతాల్ని అందిస్తోంది. ఈ ట్రైలర్ తో సినిమా ఫై మరింత ఆసక్తి పెరిగింది. మరి సినిమా ఎలా ఉంటుందనేది చూడాలి.

1970 కాలం నాటి కథ నేపథ్యంలో నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఈ నెల 24న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకట్ బోయిన పల్లి డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు.

YouTube video