చంద్రబాబు ప్రమాణ స్వీకార టైం ఫిక్స్..?

chandrababu-comments-on-jagan

చంద్రబాబు 4 వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న ఉ.11.53 గంటలకు ఆయన పదవీ ప్రమాణం చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. 12న కూడా పండితులు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. మరీ ఆలస్య మవుతుందనే కారణంతో వద్దనుకున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంతమైన అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ 15 లారీల మెటీరియల్తో రాజధాని ప్రాంతానికి చేరుకుంది. అధికారంలోకి వస్తే ప్రమాణస్వీకారం అమరావతిలో చేస్తానని చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటె కొద్దీ సేపటి క్రితం చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణస్వీకార ఏర్పాట్లపై ఆయనతో సీఎస్ చర్చించినట్లు తెలుస్తోంది.