హైదరాబాద్‌లో కాల్పుల కలకలం..

మాదాపూర్‌లో ఈరోజు తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సమీపంలో ఉదయం మూడు గంటల 50 నిమిషాల సమయంలో కారులో వచ్చి నిలబడ్డ వ్యక్తిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పుల అనంతరం బైక్ పై పరారయ్యారు. దుండగులు జరిపిన కాల్పుల్లో రియల్‌ ఎస్టెట్‌ వ్యాపారి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

వివరాల్లోకి వెళితే..

పాతబస్తి కాలపత్తర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇస్మాయిల్ అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. భూవివాదం కారణంగానే ఇస్మాయిల్ ఫై జిలానీ, మహ్మద్‌ లు కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇస్మాయిల్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లో కాల్పులు జరగ్గా.. డెడ్‌బాడీని తీసుకెళ్లి జూబ్లీహిల్స్ నీరూస్ దగ్గర వదిలివెళ్లారు. ఈ కాల్పుల వ్యవహారంలో ఓ వ్యక్తి ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం.