ఫైజర్‌ టీకా వినియోగానికి అమెరికా అనుమతి

pfizer

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారితో అమెరికా అతలాకుతలమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌, జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్‌ సంయుక్తంగా రూపొందించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈమేరకు వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతించింది. దేశంలో కరోనా కట్టడికి ఇది మార్గం సుగమం చేస్తుందని వెల్లడించింది. ఫైజర్ వినియోగంపై ఉన్న సందేహాలను తొలగించడానికి, అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఫైజర్‌ అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏ అనుమతించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/