సియారాతో కష్టాలు పడుతున్న విమానాలు

Aeroplane take off
Aeroplane take off

యూరప్‌: విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు… పెలెట్లు ఎంతో నేర్పుతో… పైకి తీసుకెళ్తారు. అదే విమానం రన్‌వే పై ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం పైలెట్లకు పెద్ద సవాలే. ఆ సమయంలో ఏ ఈదురు గాలో వస్తే… విమానం ఓ పట్టాన రన్‌వై పై దిగదు. ఇప్పుడు యూరప్‌ని సియారా తుఫాను పట్టుకుంది. ఫలితంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. అందువల్ల రన్‌వేపై విమానాలు దిగడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. చాలా విమానాశ్రయాల్లో వందల కొద్దీ విమాన సర్వీసులను రద్దు చేసేశారు. కొన్ని విమానాలు మాత్రమే ఎగురుతున్నాయి. వాటిని ల్యాండ్ చెయ్యడం కూడా సమస్యవుతోంది. ఇలాంటి సమయంలో పైలెట్లు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విమానంలో ప్రయాణికుల ప్రాణాలు పైలెట్ల చేతిలో ఉంటాయి కదా. వాళ్లు తమ ప్రాణాలు కూడా పణంగా పెట్టి విమానం నడుపుతారు. టేకాఫ్ సమయంలో విమానం పక్కకు ఒరిగినా, విమాన టైర్లు పేలినా, ఏ పక్షో ఇంజిన్‌లోకి వెళ్లినా, మంటలు చెలరేగినా, ఎయిర్‌పోర్టో గోడల్ని ఢీ కొట్టినా… ఇలా ఏ తేడా జరిగినా… విమానం పేలిపోయే లేదా మంటల్లో తగలబడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా పైలెట్లు విమానాలు నడుపుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/